
అమ గుడ్రాయువర్వఆ తి, 06 జనవరి (హి.స.)
, తెనాలి టౌన్ : తెనాలి మండలం గుడివాడ గ్రామానికి చెందిన 4 సంవత్సరాల 7 నెలల బుడతడు ‘ప్రదీప్ నారాయణ్’ సోమవారం దిల్లీలో భారత్ ప్రతిభా బాల్ సమ్మాన్-2026 పురస్కారం అందుకున్నాడు. విశేష జ్ఞాపక శక్తి, సామాజిక మాధ్యమాల ద్వారా వికసిత్ భారత్, నయా భారత్ బాహుబలి పేరిట కార్యక్రమాలను ప్రచారం చేయడం తదితర అంశాల ప్రాతిపదికన భారత్ ప్రతిభా కౌన్సిల్ (భారత ప్రభుత్వ కళా, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అనుబంధం) ఈ పురస్కారాన్ని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనపబరిచిన ప్రముఖులను సత్కరించిన ఈ వేడుకలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఉమాతులిజీ(ప్రముఖ సామాజిక సేవకురాలు, విద్యావేత్త), మేజర్ జనరల్ యశ్‌పాల్‌సింగ్‌మోర్ (భారత సైన్యంలో మాజీ అదనపు డైరెక్టర్ జనరల్) ముఖ్య అతిథులుగా హాజరై పురస్కారాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి బాలుడిగా ప్రదీప్ నారాయణ్ నిలిచాడని తల్లిదండ్రులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ