
తెలంగాణ, 06 జనవరి (హి.స.)
తెలంగాణ హైకోర్టులో ఎస్సీ రిజర్వేషన్ ల కోసం పిటిషన్ దాఖలైంది. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 27న తెలంగాణ హైకోర్టు విచారణ జరుపబోతోంది. కాగా గత నెలలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలో మిగతా స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు