మేడారం తల్లుల దర్శనానికి తరలివస్తున్న భక్తులు..
ములుగు, 05 జనవరి (హి.స.) వనదేవతలు సమ్మక్క, సారలమ్మల మహా జాతర సమీపిస్తున్న వేళ మేడారానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలో ఇవాళ(సోమవారం) తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో మేడారం ప్రాంత
మేడారం


ములుగు, 05 జనవరి (హి.స.)

వనదేవతలు సమ్మక్క, సారలమ్మల

మహా జాతర సమీపిస్తున్న వేళ మేడారానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలో ఇవాళ(సోమవారం) తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో మేడారం ప్రాంతం మినీ జాతరను తలపించింది. భక్తిశ్రద్ధలతో వనదేవతలను దర్శించుకోవడానికి కుటుంబ సభ్యులతో తరలిచ్చిన భక్తులు మొదటగా జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం జంపన్న, నాగులమ్మలకు ముడుపులు చెల్లించారు.

అనంతరం గద్దెల ప్రాంగణానికి చేరుకుని వనదేవతలను దర్శించుకుని బంగారం(బెల్లం), పసుపు, కుంకుమ, సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande