
హైదరాబాద్, 05 జనవరి (హి.స.)
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ వివిధ సంఘాలు తమ సమస్యలను ఎత్తి చూపేందుకు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా.. తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు సోమవారం తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధానంగా 2024 నుండి ప్రభుత్వం పెన్షన్ దారులకు చెల్లించాల్సిన కరువు భత్యం (DA), ఇతర పాత బకాయిలను విడుదల చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బక్క జడ్సన్ సహా పలువురు రిటైర్డ్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు