శ్రీ సత్య సాయి జిల్లాలో దారుణం.. అత్త కోడళ్లపై గ్యాంగ్ రేప్
క్రైమ్ న్యూస్, 12 అక్టోబర్ (హి.స.) శ్రీసత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగింది. వాచ్మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై ఐదుగురు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు. చిలమత్తూర
గ్యాంగ్ రేప్


క్రైమ్ న్యూస్, 12 అక్టోబర్ (హి.స.)

శ్రీసత్యసాయి జిల్లాలో దారుణ ఘటన

చోటుచేసుకుంది. అర్థరాత్రి అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగింది. వాచ్మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై ఐదుగురు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో ఈ ఇన్సిడెంట్ జరిగింది.విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు

దుండగుల కోసం గాలిస్తున్నారు. బాధితులు ఉపాధి కోసం ఇటీవలే బళ్లారి నుంచి వచ్చినట్లు గుర్తించారు.

వీళ్లంతా స్థానికంగా ఉండే ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు తెలిపారు. కుటుంబం ఒంటరిగా ఉండటాన్ని గతకొన్ని

రోజులుగా గమనించిన వాళ్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande