రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డుప్రమాదాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం.. కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశం
తెలంగాణ, 20 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల జూన్ నుంచి సెప్టెంబరు వరకు 667 మంది ప్రాణాలు పోగొట్టుకున్న విషయం పై హైకోర్టు సీరియస్ అయింది. హెల్మెట్ ధరి
రోడ్డు ప్రమాదాలపై ఏపీ హైకోర్టు ఫైర్


తెలంగాణ, 20 డిసెంబర్ (హి.స.)

రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు

ప్రమాదాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల జూన్ నుంచి సెప్టెంబరు వరకు 667 మంది ప్రాణాలు పోగొట్టుకున్న విషయం పై హైకోర్టు సీరియస్ అయింది. హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలని తాము ఇచ్చిన ఆదేశాలను పోలీసులు ఎందుకు లైట్ తీసుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది.

పోలీసులు నేరుగా రోడ్లపై ఉంటే నేరాల సంఖ్య కూడా తగ్గుతుందని అభిప్రాయపడింది. సీసీ కెమెరాలు చూసి చర్యలు తీసుకునే విధానం తగ్గించి నేరుగా రోడ్లపైనే పోలీసులు నిలబడి చలాన్లు వసూలు చేయాలని సూచించింది. రాష్ట్రంలో 99 శాతం మంది హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నారని.. ఇది ఎంత మాత్రం క్షేమం కాదని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాహనాలు నడిపే వ్యక్తి కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని హైకోర్టు ఆదేశించింది. కొందరు సంవత్సరాలుగా చలాన్లు కట్టలేదని వారిపై సెక్షన్ 167, సెక్షన్ 206 ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారి వాహనాలను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande