హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.)
హైదరాబాద్ – నారాయణ స్కూల్ లో మరో విషాదం చోటు చేసుకుంది. నారాయణ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ సంఘటన హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ స్కూల్ హాస్టల్ లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ సూసైడ్ చేసుకున్నాడు. ఉరి వేసుకుని చనిపోయాడు లోహిత్. అర్థరాత్రి అందరూ పడుకున్న సమయంలోనే… నారాయణ స్కూల్ హాస్టల్ లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ సూసైడ్ చేసుకున్నాడు.
ఈ విషయం తెలియగానే.. రంగంలోకి దిగారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. అటు నారాయణ స్కూల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్