రాష్ట్రం లో.మరో సారి భారీగా.వర్షాలు కురుస్తున్నాయి
విజయవాడ, 18 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలో) మరోసారి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, కాకినాడలో ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విశాఖ ఆర్కేబీచ్, కాకినాడ తీరాల్లో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడటంతో ప్రజలు తీవ్ర భయభ్రా
రాష్ట్రం లో.మరో సారి భారీగా.వర్షాలు కురుస్తున్నాయి


విజయవాడ, 18 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలో) మరోసారి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, కాకినాడలో ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విశాఖ ఆర్కేబీచ్, కాకినాడ తీరాల్లో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కాకినాడ ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. ఈరోజు (శుక్రవారం) కూడా కాకినాడ నగరంలో కుండపోత వర్షం కురిసింది. రెండు గంటల నుంచి ఏకధాటిగా వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు బ్రేక్ పడింది. బార్జీల నుంచి నౌకలకు బియ్యం రవాణా నిలిపివేశారు అధికారులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande