సూపర్. సిక్స్ పథకాల్లో.భాగంగా  మరి కీలక.హామీ
విజయవాడ, 12 నవంబర్ (హి.స.) సూపర్‌సిక్స్‌ పథకాల అమల్లో భాగంగా మరో కీలక హామీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ లో నిధులు కేటాయించింది. 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు
సూపర్. సిక్స్ పథకాల్లో.భాగంగా  మరి కీలక.హామీ


విజయవాడ, 12 నవంబర్ (హి.స.) సూపర్‌సిక్స్‌ పథకాల అమల్లో భాగంగా మరో కీలక హామీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ లో నిధులు కేటాయించింది. 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థికసాయం అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల్లో ప్రకటించాయి. ఈ పథకానికి అప్పట్లో ఆడబిడ్డ నిధి/మహిళాశక్తిగా నామకరణం చేశారు. ఇప్పుడు ‘మహిళలకు ఆర్థిక సహకారం’ పేరుతో ఆయా వర్గాలకు చెందిన వారికి 2024-25 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.3,341.82 కోట్లు కేటాయించింది. బీసీ మహిళలకు రూ.1099.78 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ.629.37 కోట్లు, మైనారిటీలకు రూ.83.79 కోట్లు, ఎస్సీ మహిళలకు రూ.1198.42 కోట్లు, గిరిజన మహిళలకు రూ.330.10 కోట్లు ప్రతిపాదించింది. జెండర్‌ బడ్జెట్‌లో ఈ నిధుల్ని ప్రత్యేకంగా చూపించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande