హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ(శుక్రవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది అసలు విచారణ అర్హత లేని కేసంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన.
ఈ కేసులకు అసలు విచారణ అర్హత లేదు. ఎవరు పైన అయితే పోస్ట్ పెట్టారో వాళ్లు కంప్లైంట్ చేయలేదు. ఎవరో మూడో వ్యక్తి కంప్లైంట్ చేస్తే కేసు నమోదు చేశారు. ఈ పోస్టులపై ఐటీ సెక్షన్స్ బదులుగా.. పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. ఇది ఆర్గనైజర్ క్రైమ్ అని పోలీసులు చెప్తున్నారు. కానీ, ముమ్మాటికి ఇది అలాంటి నేరమేం కాదు అని పొన్నవోలు వాదించారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. తదుపరి విచారణను వచ్చేనెల 6వ తేదీకి వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు