హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)గురుకుల పాఠశాల్లో కుట్రల వెనుక బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని అన్నారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని ఆరోపించారు. అన్ని హాస్టల్స్‌లో ప్రవీణ్ కుమార్ అనుచరులు ఉన్నారని, త్వరలోనే అన్ని విషషయాలు బయటకు వస్తాయని చెప్పారు.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు