విజయవాడ, 29 నవంబర్ (హి.స.)గత జగన్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలతోపాటు భూ కబ్జాలు భారీగా చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో రెవెన్యూ శాఖకు ఫిర్యాదులు సైతం భారీగా అందాయి. ఈ ఫిర్యాదులను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ చొరవ తీసుకుంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన శుక్రవారం అమరావతిలో సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌తోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ శాఖకు సంబంధించి.. ప్రజల నుంచి వస్తున్న వినతులు, వాటి పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను సీఎం చంద్రబాబు.. ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం వివిధ శాఖలకు 1,74,720 వినతులు రాగా.. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 67,928 ధరఖాస్తులు వచ్చాయని సీఎంకు అధికారులు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల