సూర్యుడి గుట్టు విప్పనున్న ఇస్రో..
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.) సూర్యుడి అధ్యయనం కోసం ఐరోపా స్పేస్ ఏజెన్సీ చేపట్టిన ప్రోబా-3 మిషన్‌ను తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రకటించింది. సోలార్ రిమ్‌కు దగ్గర
సూర్యుడి గుట్టు


హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)

సూర్యుడి అధ్యయనం కోసం ఐరోపా స్పేస్ ఏజెన్సీ చేపట్టిన ప్రోబా-3 మిషన్‌ను తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రకటించింది. సోలార్ రిమ్‌కు దగ్గరగా సూర్యుని కరోనాను అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన ప్రోబా-3ను PSLV-XL రాకెట్‌ ద్వారా డిసెంబరు 4న సాయంత్రం 4 గంటలకు నింగిలోకి పంపుతున్నట్టు తెలిపింది. ప్రోబా-3తో పాటు 144 మీటర్ల పొడవైన సోలార్ కరోనాగ్రాఫ్‌ను కూడా పంపుతున్నట్టు పేర్కొంది. ఈ రెండు కలిసి సూర్యుడిపై జంటగా పరిశోధనలు సాగించనున్నాయి. ఇక, భారత్ సొంతంగా ఆదిత్య ఎల్ 1 పేరుతో మొదటిసారి సూర్యుడిపై అధ్యయనానికి స్పేస్ ప్రోబ్‌ను గతేడాది పంపిన విషయం తెలిసిందే.అత్యంత ప్రకాశవంతమైన సూర్యుడి కరోనాను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలకు ఈ మిషన్ సహాయపడుతుంది. ఈ జంట ఉపగ్రహాలను భూమి నుంచి 66 వేల కిలోమీటర్ల అత్యంత ఎత్తులోని దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అక్కడకు చేరుకునే క్రమంలో ఇవి ప్రతి కక్ష్యలో 600 కి.మీ. దగ్గరగా వెళ్తాయి. అత్యంత ఎత్తులో ఉండే ఈ కక్ష్య ..ఉపగ్రహాలు గరిష్ట ఎత్తులో సుమారు ఆరు గంటల పాటు ఎగరడానికి తోడ్పడుతుంది. ఇక్కడ భూమి గురుత్వాకర్షణ ప్రభావం తక్కువగా ఉండటం వల్ల ప్రొపెల్లెంట్ వినియోగాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు, ఇది సరైన స్థాన నియంత్రణకు అనుమతిస్తుంది.‘ప్రపంచంలోనే మొట్టమొదటి ఖచ్చితమైన నిర్మాణ ఫ్లయింగ్ మిషన్’.. సూర్యుని అంతుచిక్కని కరోనాను అపూర్వమైన సామీప్యత సహా కీలక రహస్యాలను తెలుసుకోడానికి శాస్త్రవేత్తలకు అవకాశం కల్పిస్తుందని ఐరోపా స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande