వీఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చ రచ్చ.. వరద సాయంపై మాటల యుద్ధం
విజయవాడ:29 నవంబర్ (హి.స.) వీఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చ రచ్చగా మారింది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం సాగింది. వరద సాయం అందలేదని కౌన్సిల్ దృష్టికి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు తీసుకొచ్చారు. దీంతో టీడీపీ కార్పొరేటర్లు వాగ్వాదానిక
వీఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చ రచ్చ.. వరద సాయంపై మాటల యుద్ధం


విజయవాడ:29 నవంబర్ (హి.స.) వీఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చ రచ్చగా మారింది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం సాగింది. వరద సాయం అందలేదని కౌన్సిల్ దృష్టికి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు తీసుకొచ్చారు. దీంతో టీడీపీ కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు. వరద నష్టంపై ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ మహిళా కార్పొరేటర్ జమల పూర్ణమ్మపై టీడీపీ కార్పొరేటర్‌ ముమ్మినేని వెంకట ప్రసాద్‌ నోరుపారేసుకున్నారు.

ముమ్మినేని వెంకట ప్రసాద్‌పై వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. కౌన్సిల్ నుంచి టీడీపీ కార్పొరేటర్‌ను సస్పెండ్ చేయాలని వైఎస్సార్‌సీపీ పట్టుబట్టింది. దీంతో ముమ్మినేని వెంకట ప్రసాద్‌ను మేయర్ రాయన భాగ్యలక్ష్మి కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినా బయటికి వెళ్లకుండా మేయర్‌తో టీడీపీ కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande