గుంటూరు,, 29 నవంబర్ (హి.స.)రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును శుక్రవారం గుంటూరు కోర్టు కొట్టేసింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జడ్జి తీర్పు వెల్లడించారు. అయితే సాక్ష్యాలు ఇచ్చినా కూడా వాటిని కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదని, ఈ కేసులో న్యాయం కోసం పోరాడతామని రిషితేశ్వరి తల్లి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది.
రిషితేశ్వరి స్వస్థలం వరంగల్. నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ కోర్సు చేసిన ఆమె.. 2015 జులై 14వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. అయితే తన ఆత్మహత్యకు ర్యాగింగే కారణమంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరికింది. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే.. ర్యాగింగ్ వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలు లేవంటూ గుంటూరు జిల్లా ఐదవ కోర్టు .. తొమ్మిదేళ్ల విచారణ తర్వాత ఇప్పుడు కేసు కొట్టేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు