ప్రకాశం జిల్లా.టంగుటూరు మండలం  కేంద్రంలో.నిర్వహించిన క్లీన్ ప్రకాశం గ్రీన్ ప్రకాశం  పాల్గొన్న.జిల్లా కలెక్టర్  తమీమ్   అన్ సారియా 
విజయవాడ, 21 డిసెంబర్ (హి.స.) టంగుటూరు: ప్రకాశం జిల్లా టంగుటూరు మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన క్లీన్ ప్రకాశం.. గ్రీన్ ప్రకాశం..కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. ముందుగా పారిశుధ్య కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించి అనంత
   ప్రకాశం జిల్లా.టంగుటూరు మండలం  కేంద్రంలో.నిర్వహించిన క్లీన్ ప్రకాశం గ్రీన్ ప్రకాశం  పాల్గొన్న.జిల్లా కలెక్టర్  తమీమ్   అన్ సారియా 


విజయవాడ, 21 డిసెంబర్ (హి.స.)

టంగుటూరు: ప్రకాశం జిల్లా టంగుటూరు మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన క్లీన్ ప్రకాశం.. గ్రీన్ ప్రకాశం..కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. ముందుగా పారిశుధ్య కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించి అనంతరం టంగుటూరు మండలం కేంద్రంలో పారిశుధ్యం పనులను పరిశీలించారు. విధుల్లో పారిశుధ్యం పనులు చేస్తున్న కార్మికురాలి తో జీత భత్యాలు, పని సమయాలు వంటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబేడ్కర్ నగర్ లో పర్యటించి రోడ్ల పై వేసిన చెత్త అక్కడే ఉండటంతో చెత్త తొలగింపు పనులు ఏ ఏ విధంగా చేపడుతున్నారో పంచాయతీ కార్యదర్శి నీ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్పీ సీఈఓ చిరంజీవి, తాహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో దేవసేన కుమారి, గ్రామ సర్పంచ్ మద్దిరాల మమత, తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande