విజయవాడ, 21 డిసెంబర్ (హి.స.)
వీరఘట్టం: పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి ప్రాజెక్ట్ ఛైర్మన్ గా పొదిలాపు విజయరామణిని ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో ఎన్నికల అధికారి కె. రామచంద్రరావు ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఎన్నికల్లో ఆమె ఒక్కరే నామినేషన్ వేశారు. ఆమె పేరును రావివలస డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ మాచర్ల నందీశ్వరరావు ప్రతిపాదించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల