రాష్ట్రంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అయిందని నిరూపిస్తే.. తాను తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో స్పీకర్ కు అందజేస్తా.. కేటీఆర్ సవాల్ 
తెలంగాణ, 21 డిసెంబర్ (హి.స.) తెలంగాణ శాసనసభ సమావేశాలు చివరి రోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఇవాళ సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 'రైతు భరోసా' పథకంపై సుధీర్ఘంగా చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇప్ప
కేటీఆర్ సవాల్


తెలంగాణ, 21 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ శాసనసభ సమావేశాలు చివరి రోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఇవాళ సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 'రైతు భరోసా' పథకంపై సుధీర్ఘంగా చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇప్పటి వరకు రుణాలు తెచ్చుకోలేని రైతులంత రుణాలు తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.

డిసెంబర్ 9న ఒకే ఒక్క సంతకంతో ఏకకాలంలో రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి నేడు ఆ రైతులను నట్టేట ముంచేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అయిందని నిరూపిస్తే.. తాను తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో స్పీకర్ కు అందజేస్తానని సవాల్ విసిరారు. అదేవిధంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం సూచించిన విధంగా సీఎం సొంత జిల్లా కొండగల్లోని కొండారెడ్డిపల్లి, సిరిసిల్ల సహా ఏ గ్రామానికైనా వచ్చేందుకు తాను సిద్ధమని అన్నారు. ఆ గ్రామాల్లో అందరికీ రుణమాఫీ అయిందని వారు చెబితే.. తాను ఏం చేయడానికైనా సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande