తెలంగాణ, 26 డిసెంబర్ (హి.స.)
ఆటోమొబైల్ రంగంలో చత్తీస్గడ్ రాష్ట్రం 18.57% అధికంతో అనూహ్య వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు మొత్తం 11 నెలల కాలంలో రాష్ట్రంలో 6.69 లక్షలకు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి. ఇది రాష్ట్రానికి అపూర్వ విజయం.
ఈ ఏడాది ఛత్తీస్గఢ్ వాహనాల విక్రయాలు పెరగడం వెనుక రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలదే అతిపెద్ద పాత్ర. ఇవి సామాన్య ప్రజల ఆర్థిక స్థితిని నేరుగా బలోపేతం చేస్తున్నాయి. ఈ పథకాల ద్వారా వివిధ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలు అందించడం వల్ల కొనుగోలు శక్తి పెరిగిందని నిపుణులు అంటున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, వివిధ పెన్షన్ పథకాలు, నైపుణ్యాభివృద్ధి వంటి కార్యక్రమాలు రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సానుకూల మార్పులు తీసుకురావడంలో అతిపెద్ద పాత్ర పోషించాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ పథకాల ప్రభావం జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మాత్రమే కాకుండా.. మార్కెట్ కార్యకలాపాలను కూడా పెంచింది. ఛత్తీస్గఢ్కి ఇది నిజంగా ఒక పెద్ద విజయం. ఎందుకంటే ఈ రాష్ట్రం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలను కూడా వెనక్కినెట్టేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్