తెలంగాణ, 27 డిసెంబర్ (హి.స.)
‘పుష్ప' సినిమా తర్వాత అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. తాజాగా కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) షోలో అల్లు అర్జున్పై బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. ‘అల్లు అర్జున్ అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడు. ఈ గుర్తింపునకు అతను అర్హుడు. పుష్ప-2 సినిమా చూసి నేను కూడా అల్లు అర్జున్ అభిమాని అయ్యా. అల్లు అర్జున్తో నన్ను పోల్చకండి.' అని అమితాబ్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్