ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్ కు బాగా తెలుసు.. కేటీఆర్ కామెంట్స్
తెలంగాణ, 30 డిసెంబర్ (హి.స.) తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 24 ఏళ్ల పాటు కష్టపడ్డారని.. ప్రస్తుతం కాస్త రెస్ట్ తీసుకుంటున్నారని.. ఎప్పుడు బయటకు రావాలో ఆయనకు బాగా తెలుసంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్
కేటీఆర్


తెలంగాణ, 30 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 24 ఏళ్ల పాటు కష్టపడ్డారని.. ప్రస్తుతం కాస్త రెస్ట్ తీసుకుంటున్నారని.. ఎప్పుడు బయటకు రావాలో ఆయనకు బాగా తెలుసంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి హాజరైన కేటీఆర్.. మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందోదని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో పీవీ నరసింహ రావుకు మెమోరియల్ కట్టాలని అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయరని ప్రశ్నించారు. మరణంలో కూడా పీవీని కాంగ్రెస్ గౌరవించలేదని ఆరోపించారు. పీవీకి గౌరవం దక్కేవరకు రాజ్యసభలో బీఆర్ఎస్ కొట్లాడుతుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande