నల్లజర్ల, , 2 జనవరి (హి.స.)
: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెంకు చెందిన జ్యోతిష్య, వాస్తు పండితుడు, సినిమాల ముహూర్త సిద్ధాంతి కొఠారు సత్యనారాయణ చౌదరి(75) బుధవారం కన్నుమూశారు. 4 రోజులుగా తీవ్ర జ్వరంతో జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో కోలుకోలేకపోయారని వైద్యులు తెలిపినట్లు బంధువులు వివరించారు. స్వగ్రామంలో గురువారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. ఆయనకు భార్య అనసూయ, కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె నాగమణి ఉన్నారు. రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, సినీ, క్రీడాంశాలపై జ్యోతిష్యాన్ని ఆయన విశ్లేషిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల