హైదరాబాదు సంధ్య ధియేటర్ ఘటనలో.నమోదైన కేసులో. నిర్మాతలు.యలమంచిలి.  రవిశంకర్  యెర్నేని.నవీన్లకు హై కోర్టులో ఊరట
హైదరాబాద్‌, 2 జనవరి (హి.స.), : సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పుష్ప-2 సినిమా నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. దర్యాప్తు కొనసాగించవచ్చని, అయితే వారిని అరెస్ట్‌ చేయరాదని పోలీసులకు ఆ
 హైదరాబాదు సంధ్య ధియేటర్ ఘటనలో.నమోదైన కేసులో. నిర్మాతలు.యలమంచిలి.  రవిశంకర్  యెర్నేని.నవీన్లకు హై కోర్టులో ఊరట


హైదరాబాద్‌, 2 జనవరి (హి.స.), : సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పుష్ప-2 సినిమా నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. దర్యాప్తు కొనసాగించవచ్చని, అయితే వారిని అరెస్ట్‌ చేయరాదని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. తొక్కిసలాటలో ఓ మహిళ మృతి నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ రవిశంకర్, నవీన్‌లు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ కె.సుజన మంగళవారం విచారణ చేపట్టి.. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.

తొలుత పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.నవీన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ ఈ ఘటనతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధంలేదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అభియోగాలు ఏవీ వారికి వర్తించవన్నారు. హీరో అల్లు అర్జున్‌ థియేటర్‌కు వస్తున్నట్లు.. నిర్మాతల కార్యాలయ సిబ్బంది.. థియేటర్‌ నిర్వాహకులకు, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారన్నారు. ఘటన జరిగిన రోజు సీనియర్‌ అధికారులైన ఏసీపీ, డీసీపీలు థియేటర్‌కు వచ్చి భద్రతను పరిశీలించారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లను అరెస్ట్‌ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్లను ఆదేశించారు. కౌంటరు దాఖలు చేయాలని పోలీసులకు, ఫిర్యాదుదారుకు నోటీసులు జారీచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande