తెలంగాణ, 30 డిసెంబర్ (హి.స.)
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని ఇది ఆ పార్టీ సంస్కారహీనతకు అద్దం పడుతున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన మన్మోహ్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటు అన్నారు. మన్మోహన్ సింగ్ గౌరవానికి భంగం కలగకుండా వాజ్ పేయి తరహాలోనే మన్మోహన్ కు అంత్యక్రియలు నిర్వహించామన్నారు. మన్మోహన్ స్మారక చిహ్నం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించిందన్నారు. సొంత పార్టీ నాయకులను కూడా గౌరవించుకోలేని వక్రబుద్ధి కాంగ్రెస్ దని అలాంటి పార్టీ బీజేపీపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్