ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. కీలక సూచనలు..
తెలంగాణ, 30 డిసెంబర్ (హి.స.) సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. కీలక సూచనలు చేశారు. మీ స్వలాభం కోసం ప్రజాశ్రేయస్సును విస్మరించడం సరికాదని అన్నారు. మీ మాటలు నమ్మి చాలా మంది తమ బంగారు జీవితాలను చిద్రం చేసుకుంటున్నారని.. కా
ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. కీలక సూచనలు..


తెలంగాణ, 30 డిసెంబర్ (హి.స.)

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. కీలక సూచనలు చేశారు. మీ స్వలాభం కోసం ప్రజాశ్రేయస్సును విస్మరించడం సరికాదని అన్నారు. మీ మాటలు నమ్మి చాలా మంది తమ బంగారు జీవితాలను చిద్రం చేసుకుంటున్నారని.. కాసుల కోసం కక్కుర్తి పడి ఇటువంటి యాప్స్ ప్రమోట్ చేయటం సరైంది కాదని ట్వీట్ చేశారు. 'సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లరా!! కాసులకి కక్కుర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయకండి. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని.. మీరు సోషల్ మీడియాలో వదిలే ఇలాంటి వీడియోల వల్ల అమాయకులు ఆన్‌లైన్ బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులు అవుతున్నారు. బంగారు జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. మీ స్వలాభం కోసం ప్రజాశ్రేయస్సును విస్మరించడం ఎంత వరకు సమంజసం!? అంటూ ప్రశ్నించారు..

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande