తిరుమలలో తెలంగాణ సిఫారసు లేఖలకు సీఎం చంద్రబాబు అంగీకారం
తెలంగాణ, 30 డిసెంబర్ (హి.స.) ఇక నుంచి తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను తిరుమల లో అంగీకరిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుతో భేటీ తర్వాత.. వారు ఈ విష
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ


తెలంగాణ, 30 డిసెంబర్ (హి.స.)

ఇక నుంచి తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను తిరుమల లో అంగీకరిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుతో భేటీ తర్వాత.. వారు ఈ విషయాన్ని తెలియజేశారు. తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రుల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని బీఆర్‌ నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయిన బీఆర్‌ నాయుడు.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే సిఫార్సు లేఖలు తీసుకునేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు బీఆర్ నాయుడు వెల్లడించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande