భాజపా ప్రవర్తన.. దేశాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది: శశి థరూర్
దిల్లీ: , 8 డిసెంబర్ (హి.స.)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీని లక్ష్యంగా చేసుకుంటూ భారత్‌ను అస్థిరపరచడానికి అమెరికా (US) ప్రయత్నిస్తోందని భాజపా (BJP) చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్స్పందించారు. అగ్రరాజ్యంపై భాజపా చ
భాజపా ప్రవర్తన.. దేశాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది: శశి థరూర్


దిల్లీ: , 8 డిసెంబర్ (హి.స.)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీని లక్ష్యంగా చేసుకుంటూ భారత్‌ను అస్థిరపరచడానికి అమెరికా (US) ప్రయత్నిస్తోందని భాజపా (BJP) చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్స్పందించారు. అగ్రరాజ్యంపై భాజపా చేస్తున్న ఆరోపణలు ఆ పార్టీ నేతల కుటిల మనస్తత్వాలను తెలియజేస్తున్నాయని విమర్శించారు. ఇటువంటి ప్రవర్తన భారత్‌కు ఇబ్బందికరంగా మారొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘కమలం పార్టీకి ప్రజాస్వామ్యం, దౌత్యం అంటే ఏమిటో అర్థం కావడం లేదని స్పష్టమవుతోంది. చిల్లర రాజకీయాల్లో వారు పూర్తిగా కూరుకుపోయారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను విస్మరించారు. ఇతర దేశాలతో సత్సంబంధాలను కొనసాగించే విధంగా ప్రవర్తించట్లేదు. వారి బాధ్యతలను విస్మరిస్తున్నారు. కీలకమైన దేశాలతో భాజపా అనుసరిస్తున్న ఇటువంటి ప్రవర్తన భారతదేశానికి ఇబ్బందికరంగా మారవచ్చు’’ అని శశి థరూర్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande