రాజాసింగ్ హౌస్ అరెస్టుపై బండి సంజయ్ ఫైర్
తెలంగాణ మార్చి 28 (హిం.స)హోలీ పండుగ ముందు రోజుకామదహనం చేస్తున్న చెంగిచెర్ల పిట్టల బస్తీకి చెందిన వార
రాజాసింగ్ హౌస్ అరెస్టుపై బండి సంజయ్ ఫైర్


తెలంగాణ మార్చి 28 (హిం.స)హోలీ పండుగ ముందు రోజుకామదహనం చేస్తున్న చెంగిచెర్ల పిట్టల బస్తీకి చెందిన వారిపై ఒక వర్గం యువకులు దాడులు చేయగాపలువురిగా గాయాలయ్యాయి. ఈ దాడులపై బీజేపీ,హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తంచేస్తున్నారు. కాగా ఈ దాడులకు పాల్పడిన వారిపై కేసులు పెట్టకుండా తిరిగి బాధితులపై క్రిమినల్ కేసులుపెట్టారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం బండి సంజయ్ బాధితులనుపరామర్శించగా..

నేడు చంగిచెర్ల బాధితులనుపరామర్శించడానికి నేను వస్తున్నాను అని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాజాసింగ్ చెంగిచెర్లకు వెళితేసమస్యలు తలెత్తుతాయని.. ముందస్తుగా రాజాసింగ్ను హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు.

బీజేపీ ఎమ్మెల్యే గృహ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. రాజాసింగ్ను అపడం ఎవరి వల్ల కాదని.. ఆయన ఇవాల కాకపోతే రేపు, ఎప్పుడైన వెళ్తాడని,రాజసింగ్ను ఎన్నిరోజులు చంగిచెర్లకు వెళ్లకుండా అపగలరని.. చెంగిచెర్ల ఎమైన పాకిస్థాన్లో ఉందా అని బండి ప్రశ్నించారు. అలాగే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను అడ్డుకుంటుంది,

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande