ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేయాలి.. ఖమ్మం పోలీస్ కమిషనర్
తెలంగాణ: ఖమ్మం: మార్చి 28 (హిం.స) ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర
ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేయాలి.. ఖమ్మం పోలీస్ కమిషనర్


తెలంగాణ: ఖమ్మం: మార్చి 28 (హిం.స) ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. గురువారం ఖమ్మం రూరల్ డివిజన్ పరిధిలోని కారేపల్లి క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు.

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, జిల్లాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని, నగరం నుంచి వెళ్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగదు, నగలు, ఇతర్రతా సొత్తును సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగిస్తారని తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు రూ.50వేలకు మించి నగదు తీసుకువెళ్లరాదని, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు ఉంటే తప్పనిసరిగావెంట సంబంధిత ప్రతాలు ఉండాలని సూచించారు.

సంపత్ రావు హిందుస్తాన్ సమాచారం


 rajesh pande