కాంకేర్ అగ్రనేత శంకర్‌రావు సహా 29 మంది మావోయిస్టుల మృతి!?
చత్తీస్గడ్ : 17 ఏప్రిల్ (హిం.స)కాంకేర్‌ : లోక్‌సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర
కాంకేర్ అగ్రనేత శంకర్‌రావు సహా 29 మంది మావోయిస్టుల మృతి!?


చత్తీస్గడ్ : 17 ఏప్రిల్ (హిం.స)కాంకేర్‌ : లోక్‌సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకున్నది. కాంకేర్‌ జిల్లాలోని చోటే బిటియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మాడ్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన శంకర్‌రావు సహా సుమారుగా 29 మంది మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం.

శంకర్‌ పై 25 లక్షల రివార్డు ఉన్నది. ఈ ఘటనలో ఒక బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు డీఆర్జీ పోలీసులు గాయపడినట్టు సమాచారం. ఏడు ఏకే 47 తుపాకులు, మూడు ఎంఎంజీలు, ఒక ఇన్‌సాస్‌ రైఫిల్‌ సహా, పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ స్వగ్రామం చల్లగారిగే చిట్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఇదే ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ నేత శంకర్ భార్య కూడా మృతి చెందినట్లు సమాచారం దాశశ్వర్ సుమన అలియాస్ రజిత ,బజార్ హత్నూర్ ఉమ్మడి ఆదిలాబాద్

పది మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. గాయపడిన జవాన్లను హాస్పిటల్‌కు తరలించారు.

నిన్న మధ్యాహ్నం 1.30 గంటలకు ఎదురుకాల్పులు మొదలైనట్టు తెలుస్తోంది. తాజా సమాచారం అందేసరికి ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నదని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఐకే ఎలెసెలా చెప్పారని ఒక వార్తా సంస్థ తెలిపింది.

కాంకేర్‌ జిల్లాలో ఏప్రిల్‌ 26న రెండో దశలో పోలింగ్‌ జరుగనున్నది. గత నెలలో కూడా ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు చనిపోయిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తుంది...!?

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande