హెరిటేజ్ వాక్ ను విజయవంతం చేయండి: కమిషనర్ రోనాల్డ్ రోస్
హైదరాబాద్,, 17 ఏప్రిల్ (హిం.స) ప్రపంచ హెరిటేజ్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 18న జరుగు హెరిటేజ్ వాక్
హెరిటేజ్ వాక్ ను విజయవంతం చేయండి: కమిషనర్ రోనాల్డ్ రోస్


హైదరాబాద్,, 17 ఏప్రిల్ (హిం.స) ప్రపంచ హెరిటేజ్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 18న జరుగు హెరిటేజ్ వాక్ ను విజయవంతం చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ కోరారు.

ప్రపంచ హెరిటేజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 18వ తేదీ ఉదయం 7 గంటలకు దా రూల్ షిఫా నుండి ప్రారంభమై సాలర్ జంగ్ మ్యూజియం వద్ద అజఖాన ఈ జెహ్రా అశ్రు ఖానా మీదుగా ఉస్మానియా ఆసుపత్రి వద్ద ముగిస్తుంది. అక్కడ ముఖ్యంగా త్రాగు నీరు షామియానా అన్ని ఏర్పాట్లు చేయాలని ఖైరతాబాద్, చార్మినార్ జోనల్ కమిషనర్ లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ హెరిటేజ్ వాక్ ను రాష్ర్ట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో

ఈ కార్యక్రమంలో ఆసక్తి గల వారందరూ పాల్గొని హెరిటేజ్ వాక్ ను విజయ వంతం చేయాలని కమిషనర్ కోరారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande