విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు.
విశాఖ,18,,ఏప్రిల్ (హిం.స) జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్
విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు.


విశాఖ,18,,ఏప్రిల్ (హిం.స) జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు స్వీకరిస్తారు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి జేసీ మయూర్ అశోక్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. దీంతో తూర్పు నియోజకవర్గ నామపత్రాలు కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో స్వీకరించనున్నారు. విశాఖ దక్షిణం, భీమిలి, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాలకు సంబంధించి.. మహారాణిపేట, భీమిలి, పెందుర్తి, గాజువాక తహసీల్దార్ కార్యాలయాల్లో దాఖలు చేయాలి. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి జ్ఞానాపురం జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో ఇవ్వాలి. ఈనెల 25 వరకు నామపత్రాలు స్వీకరించనున్నారు. 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంది.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande