కాంగ్రెస్లో ఆధిపత్య పోరు.. ఎల్బీనగర్ లో తన్నుకున్న కార్యకర్తలు..
హైదరాబాద్ : ఏప్రిల్ 19 (హిం.స)కాంగ్రెస్లో ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. సొంతపార్టీ నేతలపైనే ఒకరిపై ఒ
కాంగ్రెస్లో ఆధిపత్య పోరు.. ఎల్బీనగర్ లో తన్నుకున్న కార్యకర్తలు..


హైదరాబాద్ : ఏప్రిల్ 19 (హిం.స)కాంగ్రెస్లో ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. సొంతపార్టీ నేతలపైనే ఒకరిపై ఒకరు విమర్శలు, భౌతిక దాడులకు పాల్పడటం పార్టీలో ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ సమక్షంలో కార్యకర్తలు తన్నుకున్నారు.

లింగోజిగూడ డివిజన్, చంపాపేట్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో.. లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకంది. సునీత మహేందర్ రెడ్డి, మధుయాష్కి గౌడ్ స్టేజీపై ఉండగానే రాజశేఖర్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు గొడవపడ్డారు. గొడవ సద్దుమనగకపోవడంతో

సమావేశం మధ్యలో నుంచి సునీతా మహేందర్ రెడ్డి, మధుయాష్కి గౌడ్ వెళ్లిపోయారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande