మేడే కార్యక్రమాలను విజయవంతం చేయండి. మేడే స్ఫూర్తితో పోరాటాలు ఉధృతం చేద్దాం
తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ ఏప్రిల్:25 (హిం స)మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాల
మేడే కార్యక్రమాలను విజయవంతం చేయండి. మేడే స్ఫూర్తితో పోరాటాలు ఉధృతం చేద్దాం*


తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ ఏప్రిల్:25 (హిం స)మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు పానుగంటి పర్వతాలు కార్మికులకు పిలుపునిచ్చారు. మేడే గోడ పత్రికలను గురువారం నాడు షాద్నగర్ పట్టణంలో మహబూబ్ నగర్ జాతీయ రహదారి పైన ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా పానుగంటి పర్వతాలు మాట్లాడుతూ నాడు పోరాట సాధించుకున్న కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లోకి మార్చడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. కార్మిక చట్టాలను కాపాడుకోవడం కోసం మే డే పూర్తి దినాన్ని పోరాట దినంగా మార్చుకొని భవిష్యత్తులో పోరాటాలు నిర్వహించాలని కార్మికులకు అయిన పిలుపునిచ్చారు. మేడే రోజు షాద్ నగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామాలలో ఎర్రజెండాలను ఆవిష్కరించి మేడే పండగను నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు ఎం శ్రీను ఏఐటీయూసీ నాయకులు లింగం నాయక్ కిషన్ నాయక్ ఆటో యూనియన్ భవన నిర్మాణ కార్మికులు రాజు రవి మదన్ తదితరులు పాల్గొన్నారు..

జనార్థన్ రంగా రెడ్డి జిల్లా హిందుస్థాన్ సమాచార్


 rajesh pande