మజ్లిస్ కు భయపడటం వల్లే బీఆర్ఎస్, కాంగ్రెస్ విమోచన దినోత్సవం నిర్వహించట్లేదు అమిత్ షా
సిద్దిపేట, ఏప్రిల్ 25 (హిం.స)ఎన్నికల పోలింగ్కు మరో పక్షం రోజుల సమయమే ఉండడంతో బీజేపీ అగ్ర నాయకత్వం త
మజ్లిస్ కు భయపడటం వల్లే బీఆర్ఎస్, కాంగ్రెస్ విమోచన దినోత్సవం నిర్వహించట్లేదు అమిత్ షా


సిద్దిపేట, ఏప్రిల్ 25 (హిం.స)ఎన్నికల పోలింగ్కు మరో పక్షం రోజుల సమయమే ఉండడంతో బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు, వీధి సమావేశాలు, ఇంటింటి ప్రచారం ఉధృతం చేసింది. ఆయా సభలు, రోడ్డు షోల్లో పాల్గొనేందుకు బీజేపీ అగ్ర నాయకత్వం తరలివస్తోంది. మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా సిద్దిపేట సభలో నేడు నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై అమిత్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

'కశ్మీర్ను భారత్లో శాశ్వతంగా అంతర్భాగం చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు. తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలి. అయోధ్యలో రామమందిరం కోసం మోదీ కృషి చేశారు. మజ్లిస్ కు భయపడటం వల్లే బీఆర్ఎస్, కాంగ్రెస్ విమోచన దినోత్సవం నిర్వహించట్లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు తీసుకువస్తాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏకతాటిపై నడుస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతిలో మునిగిపోయాయి. కాంగ్రెస్ నేతలు తెలంగాణను ఢిల్లీ ఏటీఎంగా మార్చారు' అని అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం


 rajesh pande