హైదరాబాద్ జూలై 24 హిం.స :
ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో
వెళుతున్న యువకులను వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన బుధవారం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారంలో జరిగింది. చందానగర్ ప్రాంతంలోని శాంతినగర్ లో నివాసం ఉంటున్న మనోజ్ (23), రాజు (26) ఇద్దరూ స్నేహితులు. బుధవారం తెల్లవారుజామున మదీనాగూడ జీఎస్ఎం మాల్ నుంచి చందానగర్కు రాయల్ ఎన్ ఫీల్డ్ బైకుపై బయలుదేరారు. చందానగర్ జేపీ మాల్ సమీపంలో యూటర్న్ వద్ద రాంగ్ రూట్ లో వెళ్లిన యువకులను చందానగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్తున్న వారు ఆర్టీసీ బస్సును ఢీ కొట్టారు. ఈ ఘటనలో బైకు నడుపుతున్న మనోజ్ వెనుక కూర్చోని ఉన్న రాజులకు తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో ఉన్న వారిని హాస్పిటల్ కు తరలించేలోపు ఇద్దరు యువకులు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. మోటార్ వెహికిల్ యాక్టు యూ/ఎస్ 106(1) బీఎన్ ఎస్ సెక్షన్ 184 ఎంవీ కింద కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్.. / నాగరాజ్ రావు