నిజామాబాద్ జిల్లాలో 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..
తెలంగాణ, నిజామాబాద్. 21 జనవరి (హి.స.) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మ‌హాల‌క్ష్మీ న‌గ‌ర్ లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన‌ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… నగరంలోని నాలుగో టౌన్ పరిధిలోని మహాలక్ష్మి నగర్ లో గల వా
విద్యార్థి ఆత్మహత్య


తెలంగాణ, నిజామాబాద్. 21 జనవరి (హి.స.)

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మ‌హాల‌క్ష్మీ న‌గ‌ర్ లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన‌ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… నగరంలోని నాలుగో టౌన్ పరిధిలోని మహాలక్ష్మి నగర్ లో గల వాసవి పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి చ‌దువుతున్న‌ విద్యార్థి సాక్షిత్ రెడ్డి (14) త‌మ‌ ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపడుతున్నారు. బాలుడి తల్లిదండ్రులను అడిగి పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande