తిరువనంతపురం, 20 జనవరి (హి.స.)
బాయ్ ఫ్రెండ్ ను చంపిన కేసులో కేరళలోని తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషి గ్రీష్మ (24) కు ఉరిశిక్ష ఖరారు చేసింది.
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి బాయ్‌ఫ్రెండ్‌ను గ్రీష్మ చంపింది. ఆమెకు సహకరించిన బంధువుకు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో ఈ ఘటన చోటుచేసుకోగా.. గ్రీష్మను దోషిగా తేల్చిన కోర్టు ఇవాళ శిక్షను ఖరారు చేసింది.
కన్యాకుమారి జిల్లా రామవర్మంచిరకు చెందిన గ్రీష్మ, షరోన్ రాజ్ లు ప్రేమించుకున్నారు.. ఈ క్రమంలో వారిద్దరూ శరీరికంగా దగ్గరయ్యారు.. ఆ ఫోటోలతో షరోన్ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంబించాడు.. అతడి వేదింపులు తట్టుకోలేక గ్రీష్మ ఒకరోజు తన ఇంటికి పిలిచి ప్రాణాంతకమైన కలుపు సంహారక మందు కలిపిన డ్రింక్ ఇచ్చింది. దీంతో అతడ అపస్మారక స్థితికి చేరుకున్నాడు.. అ తర్వాత అతడు చికిత్స పొందుతూ 11 రోజుల తర్వాత హాస్పటల్ లో మరణించాడు.
దీనిపై షరోన్ పేరేంట్స్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఆరెస్ట్ చేశారు.. ఈ హత్యకు సహకరించిన బందువుని సైతం అరెస్ట్ చేశారు.. ఈ కేసును విచారించిన తిరువనంతపురం కోర్టు న్యాయమూర్తి ఏఎం బషీర్ ఇది అరుదైన నేరంగా నిర్ధారించారు. నిందితురాలు ఆమె చిన్న వయస్సు , విద్యార్హత కారణంగా ఎటువంటి ఉపశమనానికి అర్హులు కాదని తీర్పు ఇచ్చారు. మహిళ చర్య సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపిందని పేర్కొన్నారు.. ఇక ఆమెకు ఉరిశిక్ష ను ఖరారు చేశారు.. ఈ తీర్పుపై పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్