అన్నవరం.సత్యదేవుని.ప్రధాన ఆలయ.విమాన గోపురానికి.బంగారు తాపడం
అమరావతి, 26 జూలై (హి.స.) అన్నవరం, : అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. బంగారు తాపడం చేయించడాన
అన్నవరం.సత్యదేవుని.ప్రధాన ఆలయ.విమాన గోపురానికి.బంగారు తాపడం


అమరావతి, 26 జూలై (హి.స.)

అన్నవరం, : అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. బంగారు తాపడం చేయించడానికి 1991లోనే కాకినాడకు చెందిన సామాజిక కార్యకర్త బి.వెంకటరమణమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అప్పటికి ఆలయ పునర్నిర్మాణం కాకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. 2012లో ఆలయ పునర్నిర్మాణం సమయంలో, 2019లో మరోసారి ప్రణాళిక చేసినా ముందడుగు పడలేదు. దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలతో గత ఏడాది మరోసారి ప్రణాళిక రూపొందించారు. డిసెంబరులో ఈవో రామచంద్రమోహన్, ఛైర్మన్‌ రోహిత్, ధర్మకర్తల మండలి సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేవాదాయశాఖ స్థపతి, దేవస్థానం ఇంజినీరింగ్‌ అధికారుల బృందం పరిశీలించి ప్రాథమిక అంచనా సిద్ధం చేశారు. సుమారు 12.5 కేజీల బంగారం అవసరం కానుందని, రూ.7 కోట్లు వ్యయమయ్యే అవకాశముందని అంచనా వేశారు. ప్రత్యేక ఖాతా ద్వారా దాతల నుంచి విరాళాలు స్వీకరించి పనులు చేపట్టాలని నిర్ణయించారు. తితిదే అధికారుల బృందం అంచనాలు తయారు చేయాలని దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలిచ్చారు. దీంతో వారు శుక్రవారం గోపురాన్ని పరిశీలించి ఎంత స్వర్ణం అవసరం? ఇందుకయ్యే వ్యయం.. పనులు ఏవిధంగా చేపట్టాలో దేవస్థానానికి నివేదిక అందిస్తారు.

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు


 rajesh pande