)గుంతకల్లు - ధోన్ మరియు కర్నూలు సిటీ సెక్షన్ లో  తనిఖీ నిర్వహించిన  దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్
హైదరాబాద్, 26 జూలై (హి.స.)దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ గుంతకల్లు – ధోన్ - కర్నూలు సిటీ సెక్షను ఈ రోజు అనగా 26 జూలై 2024న తనిఖీ చేశారు. ఆయనతో పాటు ఈ తనిఖీలో గుంతకల్లు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ ఎం.విజయ్ కుమార్ మర
)గుంతకల్లు - ధోన్ మరియు కర్నూలు సిటీ సెక్షన్ లో  తనిఖీ నిర్వహించిన  దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్


హైదరాబాద్, 26 జూలై (హి.స.)దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ గుంతకల్లు – ధోన్ - కర్నూలు సిటీ సెక్షను ఈ రోజు అనగా 26 జూలై 2024న తనిఖీ చేశారు. ఆయనతో పాటు ఈ తనిఖీలో గుంతకల్లు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ ఎం.విజయ్ కుమార్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జనరల్‌ మేనేజర్‌ గుంతకల్లు లోని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయంలో డివిజన్ యొక్క పనితీరుపై సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా వివిధ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించి ప్రస్తుతం కొనసాగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమీక్షానంతరం జనరల్ మేనేజర్ మీడియా ప్రతినిధులతో సంభాషించారు.

జనరల్‌ మేనేజర్‌ శ్రీ అరుణ్‌కుమార్‌ జైన్‌ గుంతకల్లులో నూతనంగా నిర్మించిన డివిజనల్‌ ఆపరేషన్ & కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ భవనం అత్యంత ఆధునికతో మరియు పర్యావరణహితంగా నిర్మించడం జరిగింది. ఈ కేంద్రం లో రైలు కార్యకలాపలను సజావుగా నిర్వహహించడానికి 24/7 పర్యవేక్షిస్తారు.

జనరల్ మేనేజర్ గుంతకల్లు నుండి ధోన్ సెక్షన్ వరకు రియర్ విండో తనిఖీని నిర్వహించారు. ఈ తనిఖీలో ట్రాక్లు, వంతెనలు మరియు సిగ్నలింగ్ వ్యవస్థల నిర్వహణకు సంబంధించిన భద్రతా అంశాలను పరిశీలించారు. తదుపరి జనరల్ మేనేజర్ ధోన్ రైల్వే స్టేషన్‌ క్షుణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా స్టేషన్లో అందుబాటులో ఉన్న ప్రయాణికుల సౌకర్యాలను సమీక్షించారు మరియు స్టేషన్ పరిసర ప్రాంగణాన్ని, స్టేషన్‌ మాస్టర్‌ కార్యాలయం, వెయిటింగ్‌ హాల్‌, సర్క్యులేటింగ్‌ ఏరియాను కూడా ఆయన పరిశీలించారు.

తదుపరి జనరల్ మేనేజర్ ధోన్-కర్నూల్ సెక్షన్‌లో రియర్ విండో తనిఖీని చేపట్టారు. ఆయన వెంట హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లోకేష్ విష్ణోయ్ ఉన్నారు. జనరల్‌ మేనేజర్‌ కర్నూలు సిటీ రైల్వేస్టేషన్‌ను పరిశీలించి అక్కడవున్న ప్రయాణీకుల సౌకర్యాలకు సంబందించిన వివరాలపై సమీక్షించి స్టేషన్ మాస్టర్ కార్యాలయం మరియు సర్క్యులేటింగ్ ఏరియాను కూడా ఆయన పరిశీలించారు

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande