2024 ఒలింపిక్‌-పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ 24 మంది విద్యార్థులు పాల్గొంటునారు
జలంధర్‌ 27 జూలై (హి.స.): పారిస్‌లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్‌ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచస్థాయిలో జరిగే ఈ
2024 ఒలింపిక్‌-పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ 24 మంది విద్యార్థులు పాల్గొంటునారు


జలంధర్‌ 27 జూలై (హి.స.): పారిస్‌లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్‌ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచస్థాయిలో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలకు భారత్‌ నుంచి వెళ్లిన మొత్తం క్రీడాకారుల్లో ఎల్పీయూ విద్యార్థుల వాటా 21 శాతం ఉండటం తమకు గర్వకారణంగా పేర్కొంది. చదువుతోపాటు క్రీడలకు తమ విశ్వవిద్యాలయం ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది తార్కాణమని తెలిపింది. జావెలిన్‌ త్రో, రెజ్లింగ్, హాకీ, అథ్లెటిక్స్, వెయిట్‌ లిఫ్టింగ్, షూటింగ్, బాక్సింగ్‌ వంటి విభిన్న క్రీడాంశాల్లో ఎల్పీయూ విద్యార్థులు వారి ప్రతిభను ప్రదర్శించనున్నారుe’

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande