నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్‌ భాగస్వామి: సీబీఐ
దిల్లీ, 7 సెప్టెంబర్ (హి.స.): దిల్లీ మద్యం విధానానికి (Delhi Excise Policy Scam Case) సంబంధించి సీబీఐ (CBI) చేస్తున్న దర్యాప్తు ముగిసింది. తమ విచారణలో కీలక విషయాలను ఛార్జిషీట్‌లో పేర్కొంది. దానిలో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)పై
అరవింద్‌ కేజ్రీవాల్‌


దిల్లీ, 7 సెప్టెంబర్ (హి.స.): దిల్లీ మద్యం విధానానికి (Delhi Excise Policy Scam Case) సంబంధించి సీబీఐ (CBI) చేస్తున్న దర్యాప్తు ముగిసింది. తమ విచారణలో కీలక విషయాలను ఛార్జిషీట్‌లో పేర్కొంది. దానిలో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పన నుంచి దాన్ని అమలుచేయడం వరకు జరిగిన నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్‌ భాగస్వామి అంటూ ఆరోపించింది. సీబీఐ చేసిన ఆరోపణలను ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) తీవ్రంగా ఖండించింది.

‘‘ఎక్సైజ్‌ పాలసీ నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్‌ కీలక సూత్రధారి. మద్యం పాలసీ రూపకల్పన నుంచి దాన్ని అమలుచేయడం వరకు సీఎం ప్రమేయం ఉంది. ఆ మద్యం విధానం వల్ల తమ పార్టీకి ప్రయోజనం చేకూరాలని అతడు డిమాండ్‌ చేశాడు. అందుకోసం అతని సన్నిహిత సహచరుడు, ఆప్‌ మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌ఛార్జి విజయ్‌ నాయర్‌ ఈ వ్యాపారంలో వివిధ వాటాదారులను సంప్రదించారు. చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడ్డారు’’ అని సీబీఐ సమర్పించిన పత్రాల్లో పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande