ఈడీ సోదాల్లో వెలుగులోకి సందీప్‌ ఘోష్‌ లగ్జరీ బంగ్లా.. కీలక పత్రాలు స్వాధీనం..!
దక్షిణ 24 పరగణాల 7 సెప్టెంబర్ (హి.స.) ఆర్జీ కర్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ ఘోష్‌తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈడీ సోదాల్లో వెలుగులోకి సందీప్‌ ఘోష్‌ లగ్జరీ బంగ్లా.. కీలక పత్రాలు స్వాధీనం..!


దక్షిణ 24 పరగణాల 7 సెప్టెంబర్ (హి.స.)

ఆర్జీ కర్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ ఘోష్‌తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు సందీప్‌ ఘోష్‌కు సంబంధించిన రెండతస్తుల ఓ లగ్జరీ ఇంటిని ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఇంటి ప్రాపర్టీ సందీప్‌ ఘోష్‌తో పాటు భార్య సంగీతకు చెందినదిగా ఈడీ వర్గాలు తెలిపాయి. కాగా, లగ్జరీ బంగ్లా చుట్టూ వందల ఎకరాల ఖాళీ స్థలం ఉంది అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గుర్తించారు. సంగీత- సందీప్ విల్లా అనే నేమ్‌ప్లేట్‌ను కలిగి ఉన్న ఈ బిల్డింగ్‌ సందీప్‌ ఘోష్, ఆయన భార్య సంగీత పేరు మీద ఉన్నట్లు వెల్లడైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande