పసిడి ప్రియులకు శుభవార్త: మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.)సెప్టెంబర్ నెలలో మొదటిసారి పెరిగిన బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు తులం బంగారం రేటు రూ. 440 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.72870 వద్ద నిలిచింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాల
పసిడి


హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.)సెప్టెంబర్ నెలలో మొదటిసారి పెరిగిన బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు తులం బంగారం రేటు రూ. 440 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.72870 వద్ద నిలిచింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.

విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో శనివారం బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. తులం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 400 తగ్గి రూ. 66800 వద్దకు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 440 తగ్గి రూ.72870 వద్ద నిలిచింది.

చెన్నైలో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 66800 & 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72870గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తక్కువ.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande