కృష్ణా నది తీరంలో వజ్రాలు వేట కొనసాగుతోంది
అమరావతి, 27 జూలై (హి.స.) , నందిగామ : కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు. చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం వద్ద కృష్ణానదికి ఇరుపక్కలా గోద
కృష్ణా నది తీరంలో వజ్రాలు వేట కొనసాగుతోంది


అమరావతి, 27 జూలై (హి.స.)

, నందిగామ : కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు. చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం వద్ద కృష్ణానదికి ఇరుపక్కలా గోదావరి ప్రాంతంలో ఉన్న పాపికొండల్లాగ ఎత్తైన కొండలు ఉన్నాయి. నందిగామ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమెట్ల గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో కొండల్లో వజ్రాలు ఉంటాయని ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు అన్వేషణ చేస్తున్నారు. కనీసం ఇక్కడికి బస్సు సౌకర్యం లేకపోయిన ఆటోలు, ద్విచక్రవాహనాలు, కార్లపై వస్తుంటారు. ఏడాది పొడవునా సాగే వజ్రాల వేటకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంటారు. కొందరైతే కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనాలు, క్యాన్లల్లో తాగడానికి నీరు తీసుకుని వస్తుంటారు. కొండపై కొంత దూరం వరకే ద్విచక్ర వాహనాలపై వెళ్లటానికి వీలుంటుంది. అక్కడి నుంచి కొండపై రాళ్లల్లో, చెట్ల మధ్య నడుచుకుంటూ వెళ్లి కొండ పైభాగానికి చేరుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కొండపై దట్టంగా ఉన్న చెట్ల మధ్య, రాళ్ల మధ్యకు వెళ్లి మట్టిని తవ్వి వజ్రాలు కోసం పరిశీలన చేస్తున్నారు. దీనిలో భాగంగా కనపడిన రంగురాళ్లను జాగ్రత్త చేస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు


 rajesh pande