భారత ప్రధానమంత్రి ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ భేటీ
దిల్లీ: 27 జూలై (హి.స.) రష్యా దండయాత్రతో గత రెండేళ్లకు పైగా యుద్ధ భూమిలో నలిగిపోతున్న ఉక్రెయిన్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi Ukraine Visit) పర్యటించనున్నారు. వచ్చే నెలలో ఆయన కీవ్‌ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు విశ్వసనీయ వర్
భారత ప్రధానమంత్రి ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ భేటీ


దిల్లీ: 27 జూలై (హి.స.) రష్యా దండయాత్రతో గత రెండేళ్లకు పైగా యుద్ధ భూమిలో నలిగిపోతున్న ఉక్రెయిన్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi Ukraine Visit) పర్యటించనున్నారు. వచ్చే నెలలో ఆయన కీవ్‌ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆగస్టు 23న మోదీ (PM Modi) ఉక్రెయిన్‌కు వెళ్లి ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ (Volodymyr Zelensky)తో భేటీ కానున్నట్లు సమాచారం.

2022లో ఉక్రెయిన్‌పై రష్యా (Russia) సైనిక చర్య మొదలుపెట్టిన తర్వాత ప్రధాని మోదీ కీవ్‌ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోదీ, జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. అంతకుముందు భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన మోదీకి ఉక్రెయిన్‌ (Ukraine) అధ్యక్షుడు ఫోన్‌ చేసి అభినందనలు తెలియజేశారు.

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande