రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ళ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి నారాయణ.ఆదేశం
అమరావతి, 27 జూలై (హి.స.) రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసేలా చూడాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎనిమిది మున్సిపల్‌ కార్పొరేషన్‌లకు కొత్తగా నియమించిన కమిషనర్లతో మంత్రి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించ
రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ళ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి నారాయణ.ఆదేశం


అమరావతి, 27 జూలై (హి.స.) రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసేలా చూడాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎనిమిది మున్సిపల్‌ కార్పొరేషన్‌లకు కొత్తగా నియమించిన కమిషనర్లతో మంత్రి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆయా కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, టిడ్కో ఇళ్లపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... ‘నగరాల్లో పార్కులు, సెంట్రల్‌ డివైడర్లు, రోడ్ల గుంతలు పూడ్చడం, డ్రైన్లులో పూడిక తొలగింపుపై దృష్టి పెట్టాలి. రోడ్లపై సెంట్రల్‌ డివైడర్‌లలో ఎలాంటి ఫ్లెక్సీలు ఉన్నా వెంటనే తొలగించాలి’ అని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ హరినారాయణ, టిడ్కో ఎండీ సాయికాంత్‌ వర్మ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ గంధం చంద్రుడు పాల్గొన్నారు.

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు


 rajesh pande