రాజవంశీకులు నిర్మించిన సమాధులను-యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో
దిల్లీ: , 27 జూలై (హి.స.)అస్సాంలో అహోమ్‌ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. ఈశాన్య భారతం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే. భారత్‌లో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 4
రాజవంశీకులు నిర్మించిన సమాధులను-యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో


దిల్లీ: , 27 జూలై (హి.స.)అస్సాంలో అహోమ్‌ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. ఈశాన్య భారతం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే. భారత్‌లో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాలలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అస్సాంలోని పిరమిడ్ల వంటి మట్టి సమాధులను మోయిదమ్‌ అంటారు. 600 ఏళ్లపాటు అస్సాంను పాలించిన టాయ్‌-అహోం రాజవంశం తమ పూర్వీకులను చరాయ్‌ దేవ్‌లో మట్టితో పిరమిడ్‌ ఆకృతిలో నిర్మించిన దిబ్బలలో సమాధి చేసేది.

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande