షా కమిషన్‌’ నివేదికపై కేంద్రానికి రాజ్యసభ ఛైర్మన్‌ కీలక సూచన
దిల్లీ: 27 జూలై (హి.స.) దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్‌’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. దాని ప్రామాణిక ప్రతిని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్
షా కమిషన్‌’ నివేదికపై కేంద్రానికి రాజ్యసభ ఛైర్మన్‌ కీలక సూచన


దిల్లీ: 27 జూలై (హి.స.) దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్‌’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. దాని ప్రామాణిక ప్రతిని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఆ నివేదికను బహిరంగ పరచాలంటూ భాజపా ఎంపీ ఒకరు చేసిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. చట్టసభ సభ్యులతో పాటు దేశ పౌరులకూ ఇది ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. దేశంలో చీకటి రోజులుగా పేర్కొనే 1975 నాటి ‘ఎమర్జెన్సీ’ కాలంలో జరిగిన దురాగతాలపై భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.సి.షా నేతృత్వంలో 1977లో ఏర్పాటైన కమిటీ దర్యాప్తు జరిపింది.

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande