నారా లోకేష్ ప్రజా దర్బార్.కు.పోటెత్తిన.జనాలు
తాడేపల్లి, , 31 జూలై (హి.స.) గత ప్రభుత్వ హయాంలో సమస్యలు పరిష్కారం కాక కష్టాలు, కన్నీళ్లుతో కాలం వెళ్లదీసిన బాధితులకు మంత్రి లోకేశ్‌ ప్రజాదర్బార్‌ భరోసా ఇస్తోంది. ప్రజల విన్నపాలపై తక్షణమే స్పందిస్తున్న ఆయన.. అప్పటికప్పుడు పలు సమస్యలు పరిష్కరిస్తున్నార
నారా లోకేష్ ప్రజా దర్బార్.కు.పోటెత్తిన.జనాలు


తాడేపల్లి, , 31 జూలై (హి.స.) గత ప్రభుత్వ హయాంలో సమస్యలు పరిష్కారం కాక కష్టాలు, కన్నీళ్లుతో కాలం వెళ్లదీసిన బాధితులకు మంత్రి లోకేశ్‌ ప్రజాదర్బార్‌ భరోసా ఇస్తోంది. ప్రజల విన్నపాలపై తక్షణమే స్పందిస్తున్న ఆయన.. అప్పటికప్పుడు పలు సమస్యలు పరిష్కరిస్తున్నారు. దీంతో జనం కొండంత ఆశతో ప్రజాదర్బార్‌కు తరలివస్తున్నారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో మంగళవారం 20వ రోజు కూడా ప్రజాదర్బార్‌కు పోటెత్తారు. వారందరి నుంచీ ఆయన అర్జీలు స్వీకరించారు. పలువురు దివ్యాంగుల వద్దకు తానే వెళ్లి ఆప్యాయంగా పలుకరించి.. చేతిలో చేయి వేసి మాట్లాడారు. అర్జీలు తీసుకుని వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు


 rajesh pande